తెలంగాణ కవిత్వ పీఠికలు - అస్తిత్వ సంఘర్షణలు

Main Article Content

ఐనాల భరత్

Abstract

ప్రాచీన కావ్య అవతారికల స్థానంలో ఆధునిక సాహిత్యంలో పీఠికలు ఒక ప్రత్యేక ప్రక్రియగా రూపుదిద్దుకున్నాయి. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చిన పీఠిక, గ్రంథంలోని గుణదోషాలను విశ్లేషించడమే కాకుండా విమర్శనా రంగాన్ని విస్తృతం చేసింది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమ సమయంలో వచ్చిన కవిత్వానికి ఈ పీఠికలు బలమైన పునాదిని, మార్గనిర్దేశాన్ని అందించాయి. మలిదశ ఉద్యమ కవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ, సమాజాన్ని చైతన్యపరచడంలోనూ ఇవి కీలక పాత్ర పోషించాయి. ప్రాంతీయ అస్తిత్వం, భాషాభిమానం, మరియు సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ, రచయితలు తమ అంతరంగాన్ని ఆవిష్కరించడానికి, అసమానతలను ప్రశ్నించడానికి పీఠికలను వేదికగా చేసుకున్నారు. ఇవి తెలంగాణ సాహిత్య విమర్శను మరింత పటిష్టం చేశాయి.

Article Details

Section

Research Articles

Author Biography

ఐనాల భరత్

యూ.జి.సి సీనియర్ రీసెర్చ్ ఫెలో, తెలుగు శాఖ, స్కూల్ అఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్.

References

చంద్రశేఖర్ రెడ్డి. డి. “తెలుగు పీఠిక” ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాదు, 1990.

దేవందర్ అన్నవరం, “మంకమ్మ తోట లేబర్ అడ్డా" నూతనసాహితిప్రచురణలు, కరీంనగర్,2005.

ప్రతాపరెడ్డి కాసుల, "తెలంగాణ సాహిత్యోద్యమాలు"తెలంగాణ ప్రచురణలు, 2015.

యాకూబ్. "తెలంగాణ సాహిత్య విమర్శ" మాధ్యమం ప్రచురణలు, 2008.

వేణుగోపాల్ ఎన్. "ప్రత్యేక తెలంగాణ ఉధ్యమాల చరిత్ర” విశ్లేషణ ప్రచురణలు,1999.

వేణుగోపాల్. ఎన్. "లేచి నిలిచిన తెలంగాణ” స్వేచ్ఛా సాహితి హైదరాబాదు,2010.

శ్రీధర్ వెల్దండి “ప్రత్యేకతెలంగాణ ఉద్యమ కవిత్వం” తెలంగాణ సాహిత్య అకాడమి హైదరాబాదు, 2017

సుజాత రెడ్డి, ముదిగంటి, (సం) "ముద్దెర” రోహణం పబ్లికేషన్స్, హైదరాబాదు, 2005.