జూలూరు గౌరిశంకర్ – దీర్ఘ కవితలు విశ్లేషణ
Abstract
తెలుగు సాహిత్యంలో దీర్ఘకావ్యాలకు ప్రత్యేక ఉంది. దీర్ఘ వచనాలు అనేవి మనకు కవిత్రయుల నుండే కన్పిస్తున్నాయి. దీర్ఘ వచనాలే క్రమక్రమంగా దీర్ఘ కావ్యాలుగా సంతరించుకున్నాయి అని చెప్పవచ్చును. వచన కవితా ప్రక్రియల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది దీర్ఘకావ్యం. ఈ ప్రక్రియను రచయితలు చాలా పేర్లతో పిలుస్తున్నారు. దీర్ఘకవిత, దీర్ఘకావ్యం, మహాకావ్యం, ఇతిహాసకావ్యం, ఆధునిక ఇతిహాసం, మహేతిహాసం, ఆధునిక కావ్యం అనే పేర్లతో పిలువడం మనకు తెలుగు సాహిత్యంలో కన్పిస్తుంది. ఈ ప్రక్రియకు మూలాలు తిక్కనలోని దీర్ఘ వచనాలు. యుద్ధ దృశ్యాలు వర్ణించే పట్టులో కొన్ని దీర్ఘ వచనాలు వ్రాశారు. అవి సమాస భూయిష్టంగా, అలంకార బహుళకంగా, ఒకే కావ్యంగా కూడా ఉంటాయి. తెలుగులో వచన రచనలో తిక్కన ప్రవేశపెట్టిన విధానాన్ని అతని తరువాత కవులందరు కూడా అనుసరించారు అని చెప్పవచ్చు.
తెలుగు సాహిత్యంలో జూలూరు గౌరిశంకర్ దీర్ఘకావ్యాలు ఎక్కువగా రాశారు. ఒక రకంగా చెప్పాలంటే తన సాహిత్యం మొత్తం దీర్ఘకావ్య సాహిత్యంగా చెప్పవచ్చును. తన మొదటి రచన ఎలియస్(1991) అనే దీర్ఘకావ్యంతో తన సాహిత్య ప్రస్తానాన్ని కొనసాగించారు. అలాగే పాదముద్ర(1992) నా తెలంగాణ(1997) సెలబస్ లో లేని పాఠం(1997) రెండు ఆకాశాలు (2000), ఓం నమ: శివాయ(2001) మూడవ గుణపాఠం(2001) కాటు(2002), శవాల కమురు వాసన(2002) మొగిలిచర్ల(2004) నాలుగోకన్ను(2005) సెగ(2008) వంటి దీర్ఘకావ్యాలను జూలూరు గౌరిశంకర్ రాశారు.